తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 57,548 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 518 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న కరోనాతో ముగ్గురు మరణించడంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1683కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 204 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,995 యాక్టివ్‌ కేసులు ఉండగా వారిలో 1,767 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే మరో 157 కేసులు నమోదయ్యాయి.