అంతర్జాతీయం (International) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

అంతరిక్షంలోనే ఆహార తయారీ

నాసాతో కలిసి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ జరిపిన పరిశోధనల్లో ప్రతికూల పరిస్థితుల్లోనూ మొక్కలు పెరగడానికి ఉపయోగపడే జన్యువులను కలిగి ఉన్న పలు రకాల బ్యాక్టీరియాలను యూనివర్సిటీ నిపుణులు ఆవిష్కరించారని, ఇటీవలి ప్రాంటియర్స్‌ ఆఫ్‌ మైక్రోబయాలజీ సంచికలో ఇవి ప్రచురితమయ్యాయని అందరికి తెలిసిన విషయమే! వీటి ద్వారా రోదసిలో కూడా వ్యవసాయం చేసి ఆహారం తయారు చేసే వీలు కలుగుతుందని, వ్యోమగాములు సాధారణంగా తమకు కావాల్సిన ఆహార పదార్థాలను భూమి నుంచే తీసుకెళ్తుంటారు. కానీ భవిష్యత్తులో వారు తమకు కావాల్సిన కూరగాయలు, ఆహార పదార్థాలను అక్కడే సాగుచేసుకోవచ్చని అధ్యయనం ద్వారా వెల్లడయింది.

అంతరిక్షంలోనే ఆహార తయారీకి సంబంధించి నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబోరేటరీ (జేపీఎల్‌), అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌), వర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, స్కూల్‌ ఆఫ్‌ సైన్సెన్స్‌ సంయుక్తంగా విస్తృత అధ్యయనం చేస్తున్న వారు కనుగొన్న నాలుగు కొత్త బ్యాక్టీరియాలలో ఒకటి మిథైలో బ్యాక్టిరాయాసీ కుటుంబానికి చెందినదిగా గుర్తించగా, మిగతా మూడింటిని గతంలో ఎవరూ కనుగొనలేదని, వాటిని జన్యు విశ్లేషణచేయగా అవి మిథైలో బ్యాక్టీరియం ఇండికమ్‌తో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నట్టు గుర్తించారు.

ఆ బ్యాక్టీరియాల్లోని జన్యువులు ఒత్తిడితో కూడిన పరిస్థితులను తట్టుకోవడానికి మొక్కలకు సహాయపడటమేకాకుండా, ఇంధనాన్ని రూపొందించడంలోనూ ఎంతో దోహదపడతాయని కనుగొన్నట్టు, ఆ కొత్త బ్యాక్టీరియాలకు అన్నామలై వర్సిటీకి చెందిన విశ్రాంత, ప్రఖ్యాత భారతీయ జీవవైవిధ్య శాస్త్రవేత్త డాక్టర్‌ అజ్మల్‌ఖాన్‌ పేరుతో ‘మిథైలో బ్యాక్టీరియం అజ్మాలి’ అని పేరు పెట్టారని పరిశోధనకు నాయకత్వం వహించిన హైదరాబాద్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ అప్పారావు పొదిలె వివరించారు. అంతరిక్షంలో వ్యవసాయం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ఇది మరింత దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.