క్రైమ్ (Crime) వార్తలు (News)

మనవడి సరదా వల్ల ఒకరు మృతి చెందడంతో తాతకు జైలు శిక్ష

మైనర్ లకు వాహనాలు ఇవ్వొద్దు అని ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా కొంతమంది పెడచెవిన పెడుతున్నారు. అలాంటి సంఘటనే ఒకటి బాలానగర్ పరిధిలో జరిగింది. మనవడిపై ఒక తాతకు ఉన్న ప్రేమ మరొక విద్యార్థి మరణానికి కారణమైంది. వివరాలు చూద్దాం… రిటైర్డ్‌ బీహెచ్‌ఈఎల్‌ ఉద్యోగి కర్రి రామకృష్ణ (61) గౌతమ్‌నగర్‌లో తన కుటుంబంతో నివసిస్తున్నారు. అతని మనుమడిని (13) రోజూ ట్యూషన్‌కు తన వాహనంలో తీసుకెళుతుంటారు. అయితే ఫిబ్రవరి 9న మనువడు తాత వాహనాన్ని తీసుకొని స్నేహితులను కూర్చోపెట్టుకొని డ్రైవ్‌ చేస్తూ డివైడర్‌ను ఢీ కొట్టడంతో కింద పడ్డారు. అందులో రత్నకుమార్‌ అనే విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందగా మైనర్‌ బాలుడికి వాహనం ఇవ్వడం వల్ల ఇదంతా జరిగిందని ఆ వాహనం తాత పేరున ఉండడంతో అతనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.