ఆ కంపెనీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది, ఈ కంపెనీ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉచిత గిఫ్ట్‌ అందిస్తోందంటూ వాట్సాప్‌లో వచ్చే మెసేజులు చూసి నిజాలు తెలుసుకోకుండా ఫ్రీ గిఫ్ట్ వస్తుందనే ఆశతో ఇతరులకు పంపించేస్తుంటారు కొందరు. కానీ అలాంటి లింక్ లు క్లిక్‌ చేస్తే మాత్రం సైబర్‌ నేరగాళ్ల బారినపడతారు. ఇప్పుడు తాజాగా అమెజాన్‌ పేరిట కూడా ఓ లింక్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో తెగ సర్క్యులేట్‌ అవ్వడం మీకు కూడా తెలిసే ఉంటుంది.

ఇప్పుడు ఆ లింకును గనుక నిశితంగా గమనిస్తే అమెజాన్‌ స్పెల్లింగ్‌ తప్పుగా ఉంటుంది.
మరియు యూఆర్‌ఎల్‌ కూడా HTTPతో ప్రారంభమై ‘S’ లేదంటే అది సెక్యూర్‌ కాదని అర్థం చేసుకోవాలి. ఇలాంటివి అన్ని హెచ్‌టీటీపీతోనే ప్రారంభమవుతుంటాయి. ఇలాంటి ఫేక్‌ మెసేజులు చూసి మోసపూరిత లింక్ ల మీద క్లిక్ చేయడం ద్వారా సైబర్‌ నేరగాళ్ల పాలు అవుతుంటారు. కనుక ఇలాంటి సందేశాలు వచ్చినప్పుడు కూడా అప్రమత్తంగా ఉండండి.