మహారాష్ట్రలో భాండప్‌ ప్రాంతంలోని డ్రీమ్స్‌ మాల్‌లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సంభవించిన అగ్నిప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని, మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటిస్తున్నా అని, ప్రమాదానికి కారణమైన వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అని, బాధిత కుటుంబాలు నన్ను క్షమించమని కోరుతున్నా’’ అని సీఎం విచారం వ్యక్తం చేశారు.

‘‘గత ఏడాది కాలంగా కరోనాపై సాగుతున్న పోరాటంలో వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభించిన సమయంలో బెడ్లు, వెంటిలేటర్ల కొరత ఏర్పడడంతో తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రమాదం చోటుచేసుకున్న సన్‌రైజ్‌ ఆస్పత్రి కూడా అందులో ఒకటి. ఈ హాస్పిటల్‌ లైసెన్స్‌ గడువు మార్చి 31 వరకు ఉంది. దురదృష్టవశాత్తూ ఈ ఆస్పత్రి ఉన్న మాల్‌లో నిన్న రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. తొలుత అగ్నిప్రమాదంలో రోగులెవరూ మరణించలేదని చెప్పిన ఆస్పత్రి యాజమాన్యం.. ఆ తర్వాత కొంతమంది రోగుల ఆచూకీ గల్లంతైనట్లు పేర్కొన్నారు. ఎంతమంది రోగులు గల్లంతు అయ్యారు అనేది ఇంకా తెలియవలసిన అంశం.