భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం బంగ్లాదేశ్‌ వెళ్లిన సంగతి పాఠకులకు విదితమే! కరోనా మొదలైన తర్వాత ఇదే మోడీ మొదటి విదేశీ ప్రయాణం. అయితే ఆయన రాకను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. చట్‌గావ్‌లో అయితే తీవ్ర నిరసన ఎదురై హింసాత్మకంగా మారాయి.

ఆందోళనకారులు- పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతిచెందారని
ఘర్షణల్లో గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తీసుకెళ్లామని, అక్కడ వారు చికిత్స పొందుతూ చనిపోయారని ఒక పోలీస్ చెప్పారు.

శుక్రవారం ప్రార్థనల తర్వాత బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని బైతుల్ ముకర్రమ్ ప్రాంతంలో కూడా నిరసనలు చేపట్టడంతో అక్కడ కూడా పోలీసులు నిరసనకారుల మధ్య ఘర్షణ జరేగడంతో చాలామంది గాయపడ్డారు. వారిలో విలేఖరులు కూడా ఉండడం గమనార్హం. తమ సంస్థకు చెందిన కొందరు నిరసనకారులు చనిపోయారని హిఫాజత్-ఎ-ఇస్లాం సంస్థ నేత మజీబుర్ రహమాన్ హామిదీ కూడా ధ్రువీకరించారు. పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపారని హమీదీ ఆరోపించారు కానీ అధికారికంగా దీనిని ఎవరు ధ్రువీకరించడం లేదు.