భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ విమానాశ్రయం టాయిలెట్లలో మూడు అడుగుల నాగు పాము నక్కి కనిపించింది. దానికి బయటకు రప్పించాలంటే ఎంతకీ బయటకు కదలకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది వాటర్ గన్ ఉపయోగించారు. దీంతో ఆ పాము టాయిలెట్ నుంచి డ్రైనేజీలోకి వెళ్లడంతో స్నేక్ హెల్ప్‌లైన్ సభ్యులకు సమాచారం అందించారు. ఈ సమాచారం మేరకు స్నేక్ హెల్ప్‌లైన్ సభ్యులు దాన్ని పట్టుకొనేందుకు ప్రయత్నించడంతో పాము డ్రైనేజీ నుంచి మైదానంలోకి పరుగులు పెట్టింది. పడగ విప్పి మరీ బుసలు కొట్టింది. కానీ అతి చాకచక్యంగా పామును బందించిన స్నేక్ రెస్క్యూ సిబ్బంది అడవిలో వదిలిపెట్టారు.