టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News) వినోదం

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ నేడే ప్రారంభం!!

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ జూలై 26 నుంచి జూలై 27 వరకు రెండు రోజలపాటు జరగనున్న విషయం పాఠకులకు తెలిసిందే! అమెజాన్‌ ఈ సేల్‌లో భాగంగా సరికొత్త ఉత్పత్తులను లాంచ్‌ చేయనుండగా మరి కొన్ని ఉత్పత్తులపై భారీగా ఆఫర్లను ఇవ్వనుంది. హెచ్‌డీఎఫసీ బ్యాంకు క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులపై ఉత్పత్తులను కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును అలాగే అమెజాన్‌ స్మార్ట్‌ఫోన్స్‌, ఫిట్‌నెస్‌ అక్సేసరీస్‌, టీవీలు, అమెజాన్‌ గ్యాడ్జెట్స్‌, అలెక్సా పవర్డ్‌ డివైజ్‌లపై భారీగా ఆఫర్లను అందిస్తున్నాయి. అయితే ఈ సేల్‌ కేవలం ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ సభ్యులకు మాత్రమే.

మొబైల్‌ ఆక్సేసరిస్‌ రూ.69 నుంచి ప్రారంభం కానుండగా ల్యాప్‌ట్యాప్‌లపై సుమారు రూ. 35 వేల వరకు డిస్కౌంట్లను అందించనుంది. గేమింగ్‌, ఫిట్‌నెస్‌ ట్రాకర్స్‌పై సుమారు 60 శాతం వరకు డిస్కౌంట్లను,హెడ్‌ఫోన్స్‌పై 75 శాతం వరకు, స్పీకర్స్‌, హై స్పీడ్‌ రూటర్స్‌, వైఫై స్మార్ట్‌ సెక్యూరిటీ కెమెరాల పై సుమారు 70 శాతం వరకు, డేటా స్టోరేజ్‌ డివైజ్‌లపై సుమారు 60 శాతం వరకు, కంప్యూటర్‌ కంపోనెంట్స్‌, మానిటర్స్‌పై సుమారు 50 శాతం వరకు తగ్గింపును కొనుగోలుదారులు ప్రైమ్‌ డే సేల్‌ భాగంగా పొందవచ్చును.

ఏసీలపై సుమారు 40 శాతం, రిఫ్రిజరేటర్లపై 30 శాతం, వాషింగ్‌ మెషిన్లపై సుమారు 30 శాతం, మైక్రో వేవ్స్‌పై 35 శాతం, 43, 40 ఇంచుల స్మార్ట్‌ టీవీలపై సుమారు 50 శాతం వరకు, 4కే టీవీలపై సుమారు 60 శాతం భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.

వన్‌ప్లస్‌, శాంసంగ్‌, ఐక్యూ, షావోమీ కంపెనీల కొత్త ఉత్పత్తులు ప్రైమ్‌ డే సేల్‌లో లాంచ్‌ కానున్నాయి. పలు స్మార్ట్‌ ఫోన్లపై సుమారు రూ. 3000 కూపన్‌ ఆఫర్లను అందించనున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే స్మార్ట్‌ఫోన్లపై 6 నెలల స్క్రీన్‌ రిప్లెస్‌మెంట్‌ను ఇవ్వనుంది. టెక్నో స్మార్ట్‌ఫోన్లపై సుమారు 20శాతం పైగా డిస్కౌంట్స్‌ ఉన్నాయి. వివో స్మార్ట్‌ఫోన్లపై సుమారు 30 శాతం వరకు డిస్కౌంట్‌ దాంతో పాటు పాత ఫోన్‌ ఏక్సేచేంజ్‌పై సుమారు రూ. 2500 ఇవ్వనుంది. ఒప్పో ఫోన్లపై సుమారు 20శాతం వరకు డిస్కౌంట్‌, 12 నెలల నో కాస్ట్‌ ఈఎమ్‌ఐ అవకాశం అందిస్తుంది. వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లపై ఎక్సేచేంజీపై సుమారు రూ. 5000 అందిస్తోంది. షావోమీ ఫోన్ల ఎక్సేచేంజీపై సుమారు రూ. 3000 దాంతో పాటుగా ఎంపిక చేసిన ఫోన్లపై ఉచిత స్క్రీన్‌ రిప్లేస్‌మెంట్‌ను ఇవ్వనుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    9
    Shares
  • 9
  •  
  •  
  •  
  •