అంతర్జాతీయం (International) వార్తలు (News)

15వేల ఏళ్ల క్రితం నాటి వైరస్‌లు కనుగొన్న అమెరికన్ శాస్త్రవేత్తలు!!

15వేల సంవత్సరాల నాటి పురాతన వైరస్‌లను టిబెట్‌ పీఠభూమిపైన ఉన్న ఒక హిమానీనదంలోని మంచు నమూనాల్లో అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. పశ్చిమ చైనాలో 22వేల అడుగుల ఎత్తులో ఉన్న గులియా మంచు పర్వతం నుంచి శాస్త్రవేత్తలు రెండు మంచు కోర్‌ నమూనాలను శిఖారాగ్రం నుంచి 1,017 అడుగుల లోతులో వీటిని తీసుకొని, పరిశీలించగా అందులో 33 రకాల వైరస్‌లు గుర్తిస్తే వాటిలో 28 రకాల గురించి ఇప్పటివరకు మానవాళికి తెలియదు. ఘనీభవించి ఉండటం వల్ల అవి ఇన్నేళ్లపాటు భద్రంగానే ఉన్నాయి.

ఇవి మట్టి లేదా మొక్కల నుంచి వచ్చి ఉంటాయని, జంతువుల నుంచి వచ్చి ఉండకపోవచ్చని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మనుగడ సాగించేలా అవి మార్పులకు లోనైనట్లు, వాటి వల్ల మానవులకు హాని జరగదని శాస్త్రవేత్తలు చెప్పారు. ‘‘మంచు కొండల్లో ఉండే వైరస్‌ల గురించి సరైన వివరాలు తెలియకపోవడంతో వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా మంచు కరుగుతున్న నేపథ్యంలో వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పరిశోధనకు నాయకత్వం వహించిన లోనీ థాంప్సన్‌ వివరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    42
    Shares
  • 42
  •  
  •  
  •  
  •