టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

తెలంగాణ లో ఈ సారికి తెలుగులో బీటెక్‌ లేదా??

ప్రాంతీయ భాషల్లో బీటెక్‌ విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి దేశవ్యాప్తంగా 14 కళాశాలలు మాతృభాషలో బోధనకు అఖిల భారత సాంకేతిక విద్య మండలి(ఏఐసీటీఈ) నుంచి అనుమతులు తీసుకున్నాయి. కానీ దీనికి తెలంగాణలోని జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలు ముందుకు రాలేదు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుత(2021-22) విద్యాసంవత్సరంలో తెలుగులో సాంకేతిక విద్యను బోధించే అవకాశాలు కనిపించడం లేదని స్పష్టమవుతోంది. ప్రాంతీయ భాషల్లో బీటెక్‌ కోర్సులు ప్రారంభించే విషయాన్ని ఏఐసీటీఈ యూనివర్సిటీల్లోని విభాగాలు, అనుబంధ కళాశాలల ఇష్టానికే వదిలేసింది. రాష్ట్రంలోని కళాశాలలు 2022-23 నుంచి తెలుగులో ఇంజినీరింగ్‌ విద్యను బోధించే అవకాశముందని ఈ సంవత్సరానికి మాతృ భాషలో సాంకేతిక విద్యను అందించే అవకాశం తక్కువగా ఉందని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ డాక్టర్‌ మంజూర్‌హుస్సేన్ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    185
    Shares
  • 185
  •  
  •  
  •  
  •