వార్తలు (News) వినోదం

ఛలో రాయికల్‌ జలపాతం!!

కరోనా కారణంగా ఎక్కువ సమయం ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి రావడంతో జీవితంలో ఎక్సైట్‌మెంట్‌ కరువైంది. ఆ బోర్ నుండి విముక్తి రావాలంటే ఒకసారి రాయికల్‌ జలపాతం చూసి వచ్చేద్దాం..

ఈ జలపాతాన్ని చేరాలంటే ఎత్తైన పర్వతశ్రేణిలో అడవిలో రాళ్ల బాటలో ప్రకృతిలో మమేకం అవుతూ కాలినడకన కొంత దూరం వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న పచ్చటి అడవి, పైన జలపాతం నుంచి పారే సెలయేటి గలగల సవ్వడులు, పక్షుల కిలకిలా రావాలు, పట్టణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతిమాత ఒడిలో హాయిగా సేద తీరేందుకు ఇదొక చక్కని వేదిక. ఇటు అడ్వెంచర్‌.. అటు నేచర్‌ బ్యూటీలను ఒకేసారి అనుభవించాలంటే ఇటు వైపు ఓ సారి వెళ్లిరావచ్చు.

అక్కడకి ఎలా చేరుకోవాలి తెలుసుకుందాం!
హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ల నుంచి వచ్చే వారు పీవీ స్వగ్రామమైన భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చేరుకోవాలి. వంగర నుంచి రాయికల్ గ్రామానికి చేరుకోవాలి.
రాయిల్‌కల్‌ నుంచి దక్షిణ దిశలో 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఎత్తైన పర్వత పాదాల వద్ద రాయికల్‌ చెరువు కనిపిస్తుంది. దాదాపుగా ఇక్కడి వరకు బైకులు, కార్లు వెళ్లగలవు
చెరువు సమీపంలో వాహనాలు నిలిపి సుమారు 1.5 కిలోమీటర్లు అడవిలో ప్రయాణిస్తే జలపాతం చేరుకోవచ్చు.

అక్కడకు చేరుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
జలపాతాల వద్ద సరైన రక్షణ ఏర్పాట్లు లేవు, కాబట్టి సందర్శకుల బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. సెల్ఫీ మోజులో నిర్లక్ష్యంగా ఉన్న అనవసరపు సాహాసాలు చేసినా… ఆహ్లాదంగా, ఆనందంగా సాగాల్సిన పర్యటన మరో రకంగా మారుతుంది.
కొండల పై భాగంలో ఎలుగుబంట్లు ఉన్నాయి. కాబట్టి పైకి వెళ్లే ప్రయత్నం చేయకుండా ఉంటే మేలు.

ఫొటోల కోసం లోతు ప్రాంతాల దగ్గరకు వెళ్లొద్దు.
మద్యం తాగివెళ్లొద్దు.
జలపాతాలు ఎక్కే ప్రయత్నం చేయకూడదు.
కొండలు ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి షూ ధరిస్తే సౌకర్యంగా ఉంటుంది.
ఫుడ్‌, వాటర్‌ తదితర వస్తువులేమీ అక్కడ లభించవు. కాబట్టి పర్యటకులు తమతో పాటు అవసరమైన వస్తువులు తీసుకెళ్లడం బెటర్‌.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    6
    Shares
  • 6
  •  
  •  
  •  
  •