అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

రష్యాలో బయటపడ్డ భారీ స్కాం!!

రష్యాలో అతి పెద్ద స్కాం బయటపడింది. ఈ స్కాం లో 35 మందికిపైగా ట్రాఫిక్​ పోలీసులు భాగం పంచుకున్నారు. కల్నల్ అలెక్సీ సఫోనోవ్ అనే ఉన్నతాధికారి ఇంటికి సోదాలకు వెళ్లినప్పుడు ఆయన ఇల్లంతా బంగారంతో పోతపోసినట్లు, బెడ్రూమ్‌, హాలు, కిచెన్‌లోని పలు వస్తువులతోపాటు మరుగుదొడ్డిని కూడా బంగారంతో కట్టించుకుని దానికి మ్యాచింగ్‌గా ఫ్లోర్​ను కూడా ప్రత్యేక మార్బుల్​తో వేయించాడు.

నైరుతి రష్యాలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న స్టావ్రోపోల్​లో భూతల స్వర్గాన్ని తలపించే ఆ ఇంట్లో ఉండే ఫర్నీచర్​, గోడకు ఉండే ఫ్రేమ్​లు, కుర్చీలు, కిచెన్​లో ఉండే అలమరాలు, ఇతర సామాగ్రి అంతా బంగారంతో ధగధగలాడుతున్నాయి. ఆ ఇంటి ముందు రెండు ఖరీదైన కార్లు ఉన్నాయి.

అలెక్సీ, అతని కింద ఉండే ఆరుగురు అధికారులు పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని వాహనాలకు ఫేక్​ పర్మిట్లు ఇస్తుండడంతో వాహనాలు స్టావ్రోపోల్​లో ఎలాంటి రుసుము చెల్లించకుండా సరుకు రవాణా చేయవచ్చు. ఈ క్రమంలోనే వారు భారీగా అవినీతికి పాల్పడ్డారని, ఈ కేసులో మరో 35 మంది హస్తం ఉన్నట్టు కేసు నమోదవడంతో విచారణ కోసం వెళ్లిన పోలీస్ లు ఆ ఇంటిని చూసి నోరు వెళ్ళబెట్టారు. ఈ ఆరోపణలు గనక రుజువైతే అలెక్సీకి సుమారు 15ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •