రాజకీయం (Politics) వార్తలు (News)

ఉజ్జయిని అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని!!

హైదరాబాద్ లో బోనాల సందడి మొదలవ్వడంతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ఉదయమే ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ప్రభుత్వం తరపున అమ్మవారికి బంగారు బోనం సమర్పించి పూజలు చేశారు. వేడుకలను తిలకించేందుకు ప్రధాన ప్రాంతాల్లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ప్రజలను చల్లగా చూడాలని, కరోనా బారి నుంచి బయటపడేలా అనుగ్రహించాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •