అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

మీరాబాయి చాను రజతం.. పసిడి అయ్యే అవకాశం ఉందా??

మీరాబాయి చాను టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ 49 కిలోల పోటీల్లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే! కరణం మల్లీశ్వరి తర్వాత మళ్ళీ దేశానికి పతకం అందించింది. అయితే ఆమె పతకం వెండి నుంచి బంగారానికి అప్‌గ్రేడ్‌ అయ్యే అవకాశం ఉంది. 49 కిలోల పోటీల్లో చైనా క్రీడాకారిణి హు జిహుయి 210 కిలోలు ఎత్తి పసిడి పతకం
కైవసం చేసుకుని స్నాచ్‌లో 94 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 116 కిలోలు ఎత్తి ఘన విజయం సాధించింది. మీరాబాయి స్నాచ్‌లో 87కి, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115కి.. మొత్తంగా 202 కిలోలు ఎత్తి రజతం ముద్దాడింది.

కొన్ని కారణాల వల్ల చైనా కు చెందిన హు జిహూయిని నిర్వాహకులు ఒలింపిక్‌ గ్రామంలోనే ఉండాల్సిందిగా ఆదేశించి ఆమెకు మరోసారి డోప్‌ పరీక్షలు చేయనున్నారని, ఒకవేళ ఆ పరీక్షల్లో ఆమె విఫలమైతే మీరాబాయి రజతాన్ని స్వర్ణానికి ఉన్నతీకరిస్తారు. అయితే ఈ అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •