జాతీయం (National) వార్తలు (News)

స్వల్పంగా తగ్గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు!!

గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గుతూ సామాన్యలకు ఊరటనిస్తున్నాయి. దేశంలోని పెట్రోల్, డీజిల్ రేట్లలో ఇవాళ ఎలాంటి మార్పు లేదు. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. ఆదివారం స్థిరంగా ఉంచారు. ఇదిలాఉంటే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా పెంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం!

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 99.60 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.80 ఉండగా.. డీజిల్ ధర రూ.98.43గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.93లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.99.48గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.43 గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.06గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.99.60 లకు లభిస్తోంది.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం!

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.96గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.71 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.98.83గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.89గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.99గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.83గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.89గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83ఉండగా.. డీజిల్ ధర రూ.97.96 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.38 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.52గా ఉంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం!

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.87 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.83కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.45గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.102.08 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 93.02 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.49ఉండగా.. డీజిల్ ధర రూ.94.39గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.25 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.95.26 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.91 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.26గా ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •