ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

వ్యాక్సిన్ తీసుకోనివారికి బ్లాక్ ఫంగస్ ముప్పు!!

కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారికి కరోనా సోకినట్లయితే బ్లాక్ ఫంగస్ ముప్పు ఉందని ఈ ఏడాది మే నుంచి జులై వరకు ఈఎన్టీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, డెంటల్, జనరల్ మెడిసిన్, ఆప్తమాలజీ, ఇతర వైద్యులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ప్రత్యేక నమూనాలో రోగుల వివరాలు సేకరించి ఆరోగ్య పరీక్షల ఫలితాలను క్రోడీకరించి ప్రాథమిక నివేదికను తయారు చేశారు. ఈ అధ్యయనంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోని వారిలో బ్లాక్ ఫంగస్ ముప్పు పెరిగినట్లు, పలువురు బాధితుల్లో డెల్టా వేరియంట్ లక్షణాలు కనిపించినట్టు ఒక డోసు కూడా వ్యాక్సిన్ పొందనివారు, రోగనిరోధక శక్తి తగ్గి చక్కెర వ్యాధి కలిగి రక్తంలో ఇనుము శాతం ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ మంది బ్లాక్ ఫంగస్ బారినపడ్డట్టు తేలింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •