ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త!!

ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన తర్వాత దేశమంతటా పేపర్ కప్పుల వినియోగం పెరిగి టీ స్టాల్స్, జ్యూస్ సెంటర్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లలో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఇవి పర్యావరణానికి ఎలాంటి హాని చేయవు. కానీ మన శరీరానికి మాత్రం ఎంతో హాని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పేపర్ కప్పుల్లో టీ, ఇతర వేడి ద్రావణాలు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఖరగ్‌పూర్‌ ఐఐటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. డిస్పోజబుల్‌ పేపర్‌ కప్పులో మూడుసార్లు 100 మి.లీ. చొప్పున వేడి వేడి టీ తాగడం వల్ల 75 వేల అతి సూక్ష్మ హానికర ప్లాస్టిక్‌ కణాలు శరీరంలోకి వెళ్తాయని, 80-90 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వేడి కలిగిన 100 మి.లీ. ద్రవ పదార్థం ద్వారా 25 వేల మైక్రాన్ల ప్లాస్టిక్‌ కణాలు మనలోకి చేరతాయని, క్రోమియం, కాడ్మియం వంటి హానికారక లోహాలు శరీరంలోకి వెళ్తాయని తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •