క్రైమ్ (Crime) వార్తలు (News)

కార్వీ మోసాలపై ఆరా.. పొంతన లేని సమాధానాలతో పార్థసారథి!!

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌పై ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసుల గురించి ఆ సంస్థ ఛైర్మన్ పార్థసారథిని సెంట్రల్‌ క్రైం స్టేషన్‌(సీసీఎస్) పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణలో భాగంగా రెండో రోజు అతను చేసిన మోసాలపై కూపీ లాగుతున్నారు.

కర్ణాటక, పంజాబ్, దిల్లీలోనూ కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ దాని అనుబంధ సంస్థలైన కార్వీ రియాల్టీ, కార్వీ వెల్త్ సంస్థలపై కేసులు నమోదవ్వగా పార్థసారథిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారన్న విషయం తెలుసుకున్న ఆయా రాష్ట్రాల పోలీసులు, కేసు వివరాలు తెలుసుకునేందుకు సీసీఎస్ పోలీసులను సంప్రదించి వివరాలపై కూపీ లాగుతున్నారు.

బెంగళూరులోని బసవనగుడి పోలీసులు కార్వీ రియాల్టీ సంస్థపై రెండేళ్ల క్రితం అధిక లాభాలు ఇస్తామని ఆశ చూపించి రూ.4 కోట్లకు పైగా మదుపు చేయించి మోసం చేసిన కేసులో పార్థసారథితో సహా 13 మందిపై అక్కడ కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ పోలీసులు సైతం ఫోన్‌ ద్వారా సీసీఎస్ పోలీసులకు సంప్రదించి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇలా ఎన్ని రాష్ట్రాల్లో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ మోసాలకు పాల్పడిందనే విషయాలను పార్థసారథి వద్ద ప్రస్తావించగా దీనికి ఆయన సరైన సమాధానం చెప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •