రాజకీయం (Politics) వార్తలు (News)

కోకాపేట భూముల వేలం వ్యవహారానికి నాలుగేళ్లు!!

కోకాపేట భూముల వేలం వ్యవహారంలో జీవో నంబర్‌ 111పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగి నాలుగేళ్లు దాటినా ఉన్నతస్థాయి కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వడం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా కరోనా, తదితర కారణాలతో ఆలస్యమైందని ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ రామచంద్రరావు సమాధానమిచ్చారు.

అనంతరం హైకోర్టు స్పందిస్తూ సెప్టెంబర్‌ 13లోపు ఉన్నతస్థాయి కమిటీ నివేదిక సమర్పించాలని, నివేదిక సమర్పించకపోతే ఆరోజుతో కమిటీ రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈపీటీఆర్‌ఐ నివేదికపై కూడా అభిప్రాయాలు తెలపాలని కమిటీకి ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేస్తూ నివేదికను వెబ్‌సైట్‌లో పెట్టాలని కమిటీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ను అక్టోబర్‌ 4కి వాయిదా వేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •