అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

వారి ముఖాలను నేలకు రుద్ది అఫ్ఘానిస్తాన్‌ను కాపాడుకుంటాం : పంజ్‌షీర్ !!

అఫ్ఘానిస్తాన్‌కు చెందిన పంజ్‌షీర్ ప్రాంత వాసులు తాలిబాన్ల ముఖాలను నేలకు రుద్ది అఫ్ఘానిస్తాన్ ను కాపాడుకుంటామని ఛాలెంజ్ విసురుతున్నారు. చేతులు పైకెత్తుతూ అల్లాహ్ ఓ అక్బర్ అంటూ నినాదాలు చేస్తూ సవాల్ విసురుతున్నారని స్థానికులు అంటున్నారు. పంజ్‌షీర్ ప్రాంతాన్ని కాపాడుకునే క్రమంలో చాలా కాలం తర్వాత భారీ మెషీన్ గన్‌తో లోయలోకి కాల్పులు జరిపారు. ఈ ఫైటర్లంతా నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ (ఎన్ఆర్ఎఫ్)కు చెందిన వారు. తాలిబాన్లు కాబూల్‌ను ఆక్రమించిన తర్వాత మిగిలిన బలమైన ఫోర్స్ ఇదే.

కాబూల్ కు 90మైళ్ల దూరంలో ఉన్న హిందూ కుష్ పర్వతాలలో ఉన్న ఈ లోయలో స్థావరం ఏర్పాటు చేసుకుని పోరాటం చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వం ను చేజిక్కించుకున్నప్పటికీ ఈ లోయ ప్రాంతంపై మాత్రం గెలుపొందలేకపోయారు.

తాలిబాన్ దాడిని అడ్డుకోవడానికి ఎన్ఆర్ఎఫ్ భారీ మెషీన్ గన్ లను రెడీ గా ఉంచి శాండ్ బ్యాగ్స్ తో ప్రొటెక్ట్ చేసుకుంటూ స్టేషన్లు మానిటరింగ్ చేసుకుంటూ అమెరికా తయారీ చేసిన వాహనాల్లో పాట్రోలింగ్ చేసుకుంటూ పికప్ ట్రక్స్ లో మెషీన్ గన్స్ వేసుకుని తిరుగుతున్నారు. తాలిబాన్లకు ధీటుగా పోరాడి ఛాలెంజ్ విసరగలరని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •