క్రైమ్ (Crime) వార్తలు (News)

హైదరాబాద్‌లో నేపాల్‌ దొంగల ముఠా అరెస్ట్!!

ఇళ్లు, వ్యాపార వాణిజ్య సముదాయాల్లో పనివాళ్లను పెట్టుకునేటప్పుడు సంబంధిత వ్యక్తుల వివరాలు పూర్తిగా తెలుసుకోవాలని, చోరీకి పాల్పడాలనే ఉద్దేశంతో కొందరు దొంగలు ముందస్తు ప్రణాళిక రచించుకొని ఇళ్లలో పనివాళ్లుగా చేరుతున్నారని, యజమాని నమ్మకం చూరగొని అవకాశం వచ్చినప్పుడు చోరీలకు పాల్పడుతున్నారని, పథకం ప్రకారం చోరీలు చేసి దేశం దాటి వెళ్లిపోతున్నారని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ తెలిపారు.

మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మూసారాంబాగ్‌లో ఓ ఇంట్లో జరిగిన చోరీని టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఛేదించి నేపాల్‌కు చెందిన నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేయగా మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.4లక్షల నగదు, 5 చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. ముఠాకు నేతృత్వం వహించిన కమల్‌ షాహీపై అబిడ్స్‌ పీఎస్‌ పరిధిలో చోరీ కేసు ఉంది. ఇంట్లో పనివాడిగా చేరి యజమాని లేని సమయంలో రూ.1.18 కోట్లు కమల్‌ పాషీ ముఠా ఎత్తుకెళ్లింది. నగర వాసులు హాక్‌ ఐ అప్లికేషన్‌ను ఉపయోగించుకొని పనివాళ్ల సమాచారం ఇస్తే వాళ్ల పూర్తి వివరాలు పోలీసులు తెలుసుకుంటారని, దీని వల్ల దొంగతనాలను నియంత్రించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    344
    Shares
  • 344
  •  
  •  
  •  
  •