రాజకీయం (Politics) వార్తలు (News)

పావలా వడ్డీకే రుణాలు ఇవ్వనున్న జగన్!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుని జగనన్నకాలనీల్లో నిర్మించుకునే ఇళ్లపై లబ్ధిదారులకు పావులా వడ్డీపై రుణాలు ఇవ్వాలని,దానిప్రకారం బ్యాంకర్లతో మాట్లాడాలని సీఎం అధికారులను ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇప్పటికే ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి రిజిస్ట్రేషన్ చేసినట్లు చెప్పారు.

అత్యవసర సమయాల్లో ఆ పట్టాలపై రుణం(Loan) తెచ్చుకునేలా వెసులుబాటు కల్పించినట్లు, అలా తీసుకునే రుణాలపై (Home Loans) లబ్ధిదారుడికి కేవలం పావలా వడ్డీ మాత్రమే పడుతుందని, మిగతా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని, కొన్ని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాల్లో వినియోగించే మెటల్ ధరలు భారీగా పెంచారని తమ దృష్టికి వచ్చిందని, అధికారులు వెంటనే మెటల్ ధరలు నిర్ణయించాలని, ఆ ధరలకు మించి అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు సీఎం.

ఇంకా ఇళ్ల స్థలాల కోసం కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలని, దరఖాస్తు చేసుకున్న వారికి త్వరగా పట్టాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే పెండింగ్ లో ఉన్న 8 వేల దరఖాస్తుల పరిశీలనను సైతం వెంటనే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలో 10.11 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయన్నారు. వీటి ప్రగతిపై ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టిసారించాలని సీఎం ఆదేశించారు. మొత్తం 15.60 లక్షల ఇళ్లను తమ ప్రభుత్వం నిర్మించబోతుందన్నారు.

పింఛన్లు, బియ్యం కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు మంజూరుకు సంబంధించి 21 రోజుల్లోగా దరఖాస్తుదారుల అర్హతను నిర్ధారించాలని, 90 రోజుల్లోగా వాటిని మంజూరు చేయాలని, ఇళ్ల పట్టాలు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, చేయూత తదితర పథకాలకు సంబంధించి ఎవరైనా దరఖాస్తు చేసుకోలేకపోతే ఇప్పుడు చేసుకోవాలన్నారు. కరోనా థర్డ్ వేవ్ వస్తుందో? రాదో తెలియదన్నారు. కానీ వైద్యులు అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •