జాతీయం (National) వార్తలు (News)

ఫ్లాట్ గా నేటి మార్కెట్ సూచీలు??

గురువారం నాటి ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఒడుదొడుకులకు లోనై చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం సెన్సెక్స్‌ 55,935 పాయింట్ల వద్ద ప్రారంభమై మొదట నష్టాల్లోకి వెళ్లి మళ్లీ లాభాల బాట పట్టింది. చివరికి 4.89 పాయింట్ల లాభంతో 55,949.10 వద్ద ముగిసింది. నిఫ్టీ 2.20 పాయింట్ల లాభంతో 16,636.90 వద్ద స్థిరపడింది.

నిఫ్టీలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌, బీపీసీఎల్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభయాలతో ముగిసాయి. హిందాల్కో ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •