జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

గూగుల్ మ్యాప్స్‌లో టోల్ ధరలు??

తెలియని ప్రదేశానికి వెళ్లాలంటే ప్రతీ సిగ్నల్ వద్ద అడ్రస్ అడుగుతూ గమ్యస్థానానికి చేరుకునేవాళ్లం. గూగుల్ మ్యాప్ లో ఇప్పుడు మ్యాప్ ఆన్ చేసుకుని ఎక్కడికైనా హ్యాపీగా వెళ్లిపోవచ్చు. అలాగే సుదూర ప్రాంతాలకు ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు పెట్రోల్, డీజిల్‌ ఖర్చును లెక్కల్లోకి తీసుకుంటాం కానీ టోల్ చార్జీలు ఎంత అవుతాయో తెలియక టెన్షన్ పడిపోతుంటాం. ఇకపై ఆ సమస్యకు కూడా గూగుల్ మ్యాప్ పరిష్కారం తీసుకురానుంది. త్వరలోనే మీ రోడ్ ట్రిప్‌లో వచ్చే టోల్ ఫీజు ఎస్టిమేషన్స్‌తో పాటు ఇతర ధరలను ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది.

పోలీసుల నివేదిక ప్రకారం టోల్ అంచనాలను తెలిపే ఫీచర్ రాబోతుండగా, ఇది వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని చెబుతోంది. వినియోగదారులు టోల్ రోడ్లను కాకుండా ఇతర ప్రత్నామ్నాయ మార్గాలను ఎంచుకుంటారా? లేదా అదే రహదారిపై జర్నీని కొనసాగించాలా? అని నిర్ణయించుకోవడానికి గూగుల్ మ్యాప్స్ అందించే సమాచారం ఉపయోగపడనుంది. ఇక ఈ ఫీచర్‌ యూజర్లందరికి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ప్రస్తుతానికైతే తెలియదు ఇంకా ఎంచుకున్న ప్రాంతాలకు మాత్రమే పరిమితమవుతుందా? లేదా అన్ని దేశాలలో అందుబాటులో ఉంటుందా? అనేది విషయంలోనూ స్పష్టత లేదు.

గూగుల్ మ్యాప్స్‌లో టోల్స్‌ను తప్పించుకుని డబ్బు ఆదా చేయడం ఎలా?

మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్‌ను తెరిచి, గమ్యాన్ని సెర్చ్ బార్‌లో టైప్ చేయండి.
యాప్.. ‘డైరెక్షన్స్’ బటన్‌ను చూపించిన తర్వాత, దాన్ని క్లిక్ చేయండి.
ఇప్పుడు స్క్రీన్‌పై గల ‘యువర్ లొకేషన్’ పక్కనున్న త్రీడాట్స్ బటన్‌ను ట్యాప్ చేసి, ఆ తర్వాత ‘రూట్ ఆప్షన్స్’పై మళ్లీ క్లిక్ చేయాలి.
గూగుల్ మ్యాప్స్ మెనూను చూపుతుంది. అప్పుడు ‘అవాయిడ్ టోల్‌’ బాక్స్‌పై టిక్ చేయాలి. మీరు మెనూ నుంచి హైవేలు, ఫెర్రీలను నివారించడానికి కూడా ఎంచుకునే వీలుంది.
మీ ఎంపిక పూర్తయిన తర్వాత ‘కంప్లీటెడ్’పై నొక్కండి. ఆ తర్వాత స్క్రీన్ దిగువన ఎడమ మూలలో కనిపించే ‘స్టార్ట్’ బటన్‌పై నొక్కండి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •