టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

పే స్లిప్‌ లో ఏమేమి ఉంటాయి??

శాలరీ పే స్లిప్‌ అనేది చాలా ముఖ్యం. ఒక జాబ్‌ వదిలి మరో జాబ్‌లో చేరడానికి, కొత్త కంపెనీకి చెందిన హెచ్‌ఆర్‌ ముఖ్యంగా పాత కంపెనీలో పే స్లిప్‌ ఎలా ఉందో గమనిస్తారు. దానికి అనుగుణంగా కొత్త పే స్కేల్‌ ఆఫర్‌ ఇవ్వడంతో తనకు ఇంత శాలరీ వస్తుంది అని నిరూపించడానికి ఉపయోగపడుతుంది. కనీసం 3 నెలల పే స్లిప్పులను కొత్త కంపెనీవారు అడగుతారు. కొత్త కంపెనీలో ఉద్యోగం వస్తే, అందులో టేక్‌ హోమ్‌ శాలరీ చూపిస్తారు. మరియు కటింగ్స్‌ ఏవేవి ఉంటాయో కూడా వివరిస్తారు.

రకరకాల అలవెన్సులను లెక్కలోకి తీసుకొని, బేసిక్‌ పేని డిసైడ్‌ చేస్తారు. ఇది మొత్తం శాలరీలో 35 – 40 శాతం వరకు ఉంటుంది. ఇంటి అద్దె అలవెన్స్‌ అనేది బేసిక్‌ శాలరీలో 40-50 శాతం ఉంటుంది. ఇక మీ జీతాన్ని బట్టి ప్రొఫెషనల్‌ టాక్స్‌ ఉంటుంది. దీన్ని వేర్వేరు రాష్ట్రాలు వేర్వేరుగా నిర్ణయిస్తాయి. కేంద్ర ప్రభుత్వం దీన్ని ముందుగా స్వీకరించి, తిరిగి రాష్ట్రాలకు ఇస్తుంది. టీవీపీ నెలవారీ లేదా మూడు నెలలు లేదా ఏడాదికి ఓసారి ఉద్యోగి పెర్ఫార్మెన్సును బట్టీ చెల్లిస్తారు.

కన్వేయన్స్‌ అలొవెన్స్‌ ఉద్యోగి రవాణా భత్యం కూడా చేతికి వచ్చే టేక్‌ హోమ్‌ శాలరీలో భాగంగానే ఉంటుంది. డీఏ అంటే కరవు భత్యం. ఇది నిత్యవసరాల ధరలు పెరుగుతున్నప్పుడు ఉద్యోగికి ఆ పెరిగిన ధరలను లెక్కలోకి తీసుకొని ఇస్తారు. ఇది ప్రైవేట్‌ కంపెనీల్లో ఉండదు. వైద్య భత్యం ఉద్యోగి ఉద్యోగం చేస్తున్నప్పుడు అయ్యే వైద్య ఖర్చులకు సంబంధించింది. స్పెషల్‌ అలొవెన్స్‌ అనేది రివార్డ్‌ లాంటిది. ఉద్యోగి పనితీరు బాగుంటే దీన్ని ఇస్తారు. పీఎఫ్‌ బేసిక్‌ శాలరీ నుంచి 12 శాతంను దీనికి మళ్లీస్తారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •