ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

వైద్యారోగ్యశాఖలో 14,200 పోస్టుల భర్తీకి ఏర్పాట్లు!!

వైద్యారోగ్యశాఖపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించిన అనంతరం ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో నియామకాల భర్తీకి ఆమోదం తెలిపారు. ప్రస్తుత సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై వివరాలను అడిగి తెలుసుకుని ప్రాథమిక ఆసుపత్రుల నుంచి భోధనాసుపత్రుల వరకు సుమారు 14,200 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. అక్టోబరు నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారభించి, నవంబర్‌ 15 నాటికి ఉద్యోగాల భర్తీ ముగించాలని సూచించారు. సిబ్బంది కొరత ఉండకూడదని సూచించారు.

అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాల కొరత లేదని వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ భాస్కర్‌ తెలిపారు. కొవిడ్‌ వల్ల ఐదారురెట్లు అధికంగా ఔషధాలు కొనుగోలు చేశామని సీఎంకు వివరించారు. ఈ-ఔషధి వెబ్‌సైట్‌లో ఎక్కడా సమస్యలు లేవని, అవసరాలకు అనుగుణంగా ఔషధాలు సరఫరా చేస్తున్నామని వివరించారు. క్యాన్సర్‌ ఔషధాలు అవసరం కంటే ఎక్కువే ఉన్నాయి. ఇప్పటివరకు 2వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. మొత్తం డెంగ్యూ కేసుల్లో సగం విశాఖ జిల్లాలోనే నమోదయినప్పటికీ డెంగ్యూ జ్వరాలకు సరిపడినన్ని ఔషధాలు, టెస్ట్‌ కిట్లు ఉన్నాయి

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    2
    Shares
  • 2
  •  
  •  
  •  
  •