వార్తలు (News)

వాల్తేర్‌ నుండి బయల్దేరే పలు రైళ్ల రద్దు.. కొన్ని దారి మళ్లింపు??

గులాబ్‌ తుపాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్నింటి గమ్యాలు కుదించడం, మరి కొన్ని దారిమళ్లించి నడుపుతున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈ నెల 26న విశాఖ, విజయవాడ వైపు వెళ్లే 10 రైళ్లు, విశాఖ, విజయనగరం వైపు నడిచే మరో 6 రైళ్లను రద్దు చేసినట్లు.. 27న విశాఖ మీదుగా రాకపోకలు సాగించే 6 రైళ్లను రద్దు చేసినట్టు తెలిపారు. అలాగే ఈ నెల 26న పూరీ-ఓఖా ప్రత్యేక రైలును వయా ఖుర్థారోడ్‌, అంగూల్‌, సంబల్‌పూర్‌ మీదుగా దారి మళ్లించినట్లు, 27న విశాఖలో బయలుదేరే విశాఖ-కిరండూల్‌ ప్రత్యేక రైలును జగదల్‌పూర్‌లో నిలిపేయడంతోపాటు తిరుగు ప్రయాణంలో ఈనెల 28న జగదల్‌పూర్‌ నుండే మొదలవుతుందని చెప్పారు. పలు సాంకేతిక కారణల వల్ల ఈ చర్యలు తీసుకున్నట్లు, ప్రయాణికులు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •