వార్తలు (News)

గులాబీ తుఫాన్ కారణంగా నేడు భారీ వర్షం!!

అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో నేడు భారీ వర్షాలు పడనున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి శుక్రవారం ఉదయం అల్పపీడనంగా మారి క్రమంగా శుక్రవారం రాత్రి బలపడి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 670 కిమీ, కళింగపట్నానికి 740 కిమీ దూరంలో కేంద్రీకృతమై తీవ్రవాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా పయనించనుంది.ఈ వాయుగుండం క్రమంగా బలపడి శనివారం మధ్యాహ్ననికి తుఫాన్‌గా రూపాంతరం చెందడంతో వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈరోజు సాయంత్రానికి విశాఖపట్నం గోపాల్‌పూర్‌ మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటనుంది. ఈ తుఫాన్‌కు పాకిస్తాన్‌ సూచించిన ‘గులాబ్‌’ పేరు పెట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ తుఫాన్‌ ప్రభావం వల్ల ఆదివారం తీరం వెంబడి గంటకు 60 నుంచి 790 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కి.మీ, సోమవారం 70 నుంచి 80 కి.మీ, గరిష్టంగా 90 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు హెచ్చరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •