క్రైమ్ (Crime) రాజకీయం (Politics) వార్తలు (News)

జగన్ కేసులో ఐఏఎస్ అధికారిణీ శ్రీలక్ష్మీకి నాన్ బెయిలబుల్ వారెంట్??

గురువారం సీబీఐ, ఈడీ కోర్టు జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణ జరిపిన అనంతరం ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దాల్మియా కేసులో నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మి ఈరోజు విచారణకు రాకపోగా ఆమె తరఫు న్యాయవాదులు కూడా కోర్టుకు గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తూ ఈ వారెంట్‌ను ఈనెల 30లోగా అమలు చేయాలని ఆదేశించింది.

ఇదే కేసులో సీఎం వైఎస్ జగన్‌, విజయసాయిరెడ్డి డిశ్చార్జి పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ, ఈడీ గడువు కోరాయి. పెన్నా కేసులో విశ్రాంత ఐఏఎస్‌ జి.వెంకట్రామిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరవ్వడంతో వెంకట్రామిరెడ్డిపై ఉన్న ఎన్‌బీడబ్ల్యూను న్యాయస్థానం రీకాల్‌ చేసింది. వాన్‌పిక్‌ కేసులో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి బ్రహ్మానందరెడ్డి ఈరోజు విచారణకు హాజరు కాలేదు. వీరిద్దరికీ గతంలో హైకోర్టు మినహాయింపు ఇచ్చినప్పటికీ వారు కానీ, వారి తరఫు న్యాయవాదులు కచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో మోపిదేవి, బ్రహ్మానందరెడ్డి లాయర్లు గైర్హాజరైతే తగిన ఉత్తర్వులిస్తామని కోర్టు స్పష్టం చేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •