రాజకీయం (Politics) వార్తలు (News)

భారత్‌ బంద్‌కు మద్దతు తెలిపిన టీడీపీ!!

ఈ నెల 27 వ తేదీన రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కు టీడీపీ పార్టీ సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ చీఫ్ అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే తెలుగు దేశం పార్టీ కి ప్రధానమని, రైతులు వ్యతిరేకిస్తున్న చట్టాల పై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. రైతు వ్యతిరేక చట్టాల విషయంలో కేంద్రం పునరా లోచన చేయాలని టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. రైతులను సీఎం జగన్ కూలీలుగా మార్చారని మండి పడ్డారు.

ఈ నెల 27 వ తేదీన రైతులు చేపట్టబోయే భారత్‌ బంద్‌ కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ నేతలు భారీ సంఖ్య లో పాల్గొనాలని, రైతులకు తెలుగు దేశం పార్టీ ఎప్పటికి అండగానే ఉంటుందన్నారు అచ్చెన్నాయుడు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •