తెలంగాణ రాష్ట్రం లో మొదటి డోస్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయిందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దీనిలో ప్రభుత్వం, వైద్యసిబ్బంది కృషి చెప్పుకోదగినదని వివరించారు. దేశంలో కరోనా మొదలైన 9 నెలల తర్వాత ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. ప్రతి ఒక్కరికి వాక్సిన్ అందాలనే లక్ష్యంతో పల్లెలు, పట్టణాలు, గూడాలు అనే తేడా లేకుండా వైద్య సిబ్బంది ఇల్లిల్లు తిరిగి మరీ 130 కోట్ల డోసులను పంపిణీ చేసారు.

తెలంగాణ లో ఇప్పటికి మొదటి విడత వాక్సినేషన్ పూర్తి కాగా ప్రస్తుతం రెండోవిడత కూడా 61 శాతం మంది తీసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. ప్రతి రోజు 50 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఉత్పత్తి పెంచడంతో అనుకున్న సమయానికంటే ముందు వ్యాక్సినేషన్ ప్రక్రియ టార్గెట్ రీచ్ అయింది. మరో నెలరోజుల్లో పూర్తిస్థాయి 100 శాతం వ్యాక్సినేషన్ అందించిన రాష్ట్రంగా నిలిచే అవకాశం ఉంది.