దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ వచ్చిన దగ్గర నుండి కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగానే కరోనా థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకొనే విధముగా హైదరాబాద్ లో 1400 పడకలు ఏర్పాటు చేయనున్నారని పేర్కొన్నారు. నిలోఫర్ లో 800 పడకలు ఏర్పాటు చేస్తున్నామని, మరో 6 ఆసుపత్రిలో 100 పడకలు చొప్పున ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

వనస్థలిపురం లో కూడా 100 పడకలు ఏర్పటు చేసుకున్నామని, అందరూ కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి ,ప్రభుత్వానికి సహకరించాలని వైద్య శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు చెప్పారు.

24 లక్షలు హోమ్ ఐసోలాషన్ కిట్లను అందుబాటులో ఉంచుతామని, పేదల వైద్యం మీదా ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రంగా తెలంగాణ ను కేంద్రం ప్రకటించింది అన్నారు. పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని ఫ్రూట్ మార్కెట్ వద్ద 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రానున్నదని ప్రకటన చేశారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని, మన బస్తి ధవాఖాన్ లో దేశానికి ఆదర్శమని వైద్య శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు అన్నారు.

నగరం లో అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని బస్తి దవాఖాన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించామని ఆదేశించారని మున్సిపాలిటీలో కూడా బస్తి దవాఖాన ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. కోవిడ్ ను దృష్టిలో పెట్టుకొని అదనంగా వైద్యులను ఇక్కడ ఏర్పాటు చేసామని 2 డోస్ లు కోవిడ్ వాక్సిన్ అందరూ తీసుకోవాలని పేర్కొన్నారు. టీకా సురక్షితమని, కొంచం వ్యాధి లక్షణాలు కనిపించినా పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.