దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 9,45,455 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 6,987 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 162 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి మొత్తం సంఖ్య 4,79,682కి చేరింది. గత 24 గంటల్లో 24 గంటల్లో 7,091 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకూ కరోనా నుండి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3.42 కోట్లకు చేరింది. దేశంలో ప్రస్తుతం 76,766 క్రియాశీల కేసులున్నాయి.

దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా విస్తరిస్తోంది. ఇది ఇప్పటికే 17 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు పాకింది. ఇప్పటి వరకూ దేశంలో నమోదైన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 422కు చేరింది.