ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేట్లు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయించగా కోర్టు చీవాట్లు పెట్టడంతో లాభం లేదనుకున్న గవర్నమెంట్ మరో మార్గం వెతుక్కుని థియేటర్లపై దాడులకు తెగబడుతోంది. వినోదం పంచుతామని థియేటర్ లకు రప్పించి ప్రజలకు కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని ప్రభుత్వం బుకాయిస్తోంది. మనసులో ఏదో పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతో సినిమా వాళ్లు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు.

కోట్ల రూపాయలు ఆర్జించే సినీ పరిశ్రమపై ప్రభుత్వం వక్రదృష్టి పీతింది. మొదటి నుంచి కూడా సినిమానే ప్రధాన విలన్ గా చేసుకుని తన ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే టికెట్ల రేట్లు తగ్గించి చులకన అయిపోయింది. దీనిపై పవన్ కల్యాణ్ బహిరంగంగానే ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆయనకు ఎవరు ఆ సమయంలో మద్దతు పలుకాకపోయినా ఆయన మాట్లాడింది మాత్రం సమంజసమనే అభిప్రాయం అందరిలో వ్యక్తమైంది.

మంత్రి కొడాలి నాని సినిమా వాళ్ల మీద సెటైర్లు వేస్తూ వారిని అవహేళన చేస్తున్నారు. దీంతో వారు నానిపై మండిపడుతున్నారు. సినిమా వాళ్ల మీదే ఎందుకు ఇంత కక్ష అని ప్రశ్నిస్తున్నారు వినోదమే ప్రధానంగా మార్చుకున్న వారి జీవితాన్ని అన్ని రకాలుగా బాధలకు గురిచేయడం భావ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వం ఏదో ఆశించి సినిమా పరిశ్రమ మీద పెత్తనం చెలాయించడం భావ్యం కాదని పేర్కొంటున్నారు. సదపాయాలు లేవనే సాకుతో థియేటర్లపై దాడులకు తెగబడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్వాకంతో వ్యాపారాలు చేసుకునే మాపై ఎందుకీ వివక్ష అంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఏదో విధంగా థియేటర్లపై దౌర్జన్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని దుమ్మెత్తిపోస్తుంది.