డెహ్రాడూన్‌లోని డీఆర్‌డీవో-డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ అప్లికేషన్‌ ల్యాబొరేటరీ వివిధ విభాగాల్లో
గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయడానికి ధరకాస్తులు ఆహ్వానిస్తుంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 19
ఖాళీల వివరాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌-17, మెకానికల్‌ ఇంజనీరింగ్‌-01, కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌-01.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. 2018/2019/2020లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. 2018కి ముందు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. వీరి వయసు 01.12.2021 నాటికి 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9000 స్టైపెండ్‌ చెల్లిస్తారు. అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది గా 31.12.2021 ఉంది.