ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్లలో మరొక పిటిషన్ ను నిందితులు ఉపసంహరించుకున్నారు. క్విడ్‌ ప్రోకో వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసులను సవాల్‌ చేస్తూ నిందితులు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్లపై జస్టిస్‌ భుయాన్‌ ధర్మాసనం విచారణ కొనసాగించగా లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కేసులో నిందితుడిగా ఉన్న శ్యాంప్రసాద్‌రెడ్డి తరఫు న్యాయవాది దీనిపై వాదనలు వినిపిస్తూ, తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని చట్టపరంగా ఉన్న ఇతర ప్రత్యామ్నాయలను పరిశీలిస్తామని కోర్టుకు తెలిపారు. పిటిషన్‌ ఉపసంహరణను అనుమతిస్తూ ధర్మాసనం కూడా ఆదేశాలు జారీ చేసింది.