బ్లడ్ గ్రూప్ లు రకరకాలు ఉంటాయి. A +(పాజిటివ్) , A – (నెగెటివ్), B +(పాజిటివ్), B – (నెగెటివ్) AB + (పాజిటివ్), AB – (నెగెటివ్), O+(పాజిటివ్), O -(నెగెటివ్).. ఇవే కాకుండా కొన్ని అరుదుగా ఉండే బ్లడ్ గ్రూప్ లు కూడా ఉంటాయి. అయితే ఇందులో O+(పాజిటివ్) తప్ప మిగతా అన్ని గ్రూపుల వారికి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ అని అమెరికన్ హార్ట్ అసోషియేషన్ చేసిన అధ్యయనంలో తేలింది.

O బ్లడ్ గ్రూప్ ఉన్నవారికంటే A , B బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి గుండె జబ్బుల ముప్పును 8 శాతం ఎక్కువ ఉన్నట్టు, గుండె పోటు మాత్రమే కాకుండ హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే సమస్యలు కూడా O గ్రూప్ వారి కంటే కూడా A గ్రూప్ వారికి ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనంలో బయటపడింది. A, B బ్లడ్ గ్రూప్ కలిగినవారికి హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువ ఉండటానికి కారణం రక్తం గడ్డకట్టడం అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్నే బ్లడ్ క్లాట్స్ అంటారు. A,B గ్రూప్ బ్లడ్ ఎక్కువ సాంద్రత కలిగి ఉండి రక్తం త్వరగా గడ్డ కట్టడం అనేది జరుగుతుంది. అలా రక్తం గడ్డ కట్టే చర్యని థ్రొంబోసిస్ అని పిలుస్తారు. అలా రక్తం గడ్డ కట్టడం వల్ల గుండెకు రక్తం సరఫరా జరిగే ప్రాంతాన్ని ఆ క్లాట్స్ అడ్డగిస్తాయి. దింతో గుండె పోటు వచ్చే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఇది చాలా రేర్ గా జరుగుతుంటుంది.

ఆ గ్రూప్ ఉన్న అందరికీ అలా జరగాలని రూల్ ఏమి లేదు కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం అందరం గుర్తు పెట్టుకోవలసింది ఏంటంటే.. ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్లు అయినా సరే ఆహారపు అలవాట్ల ద్వారా మరియు సరైన వ్యాయామం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఇక్కడ ఉదహరించిన విషయాలు కేవలం కొన్ని సమయాల్లో రక్తం గడ్డకట్టే విషయంలో A, B గ్రూప్ లకు ప్రమాదం కాస్త ఎక్కువగా ఉంటుంది అని మాత్రమే వెల్లడిస్తున్నాయి.