ఆర్ఆర్ బీ గ్రూప్ డీ ఎక్సామ్ కి సంబంధించి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారు సిద్ధం అవ్వడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష రాయడానికి ఇచ్చే సమయం 90 నిముషాలు.

పరీక్షలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
జనరల్ సైన్స్ నుంచి 25 ప్రశ్నలు
మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ప్రశ్నలు
జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 ప్రశ్నల చొప్పున వస్తాయి.

జనరల్ సైన్స్ నుంచి ముఖ్యంగా సీబీఎస్ సిలబస్ ను ప్రామాణికంగా తీసుకోని రైల్వే బోర్డు ప్రశ్నలు అడుగుతోంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి బేసిక్ ప్రశ్నలు వస్తాయి. కెమిస్ట్రీలో ముఖ్యంగా ఆవర్తన పట్టికల నుంచి 2 నుంచి 3 ప్రశ్నలు వస్తున్నాయి. కరెంట్ అఫైర్స్ నుంచి స్పోర్ట్ వేదికలు, అవార్డులు, వ్యక్తుల నియామకాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. జనరల్ అవేర్‌నెస్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనమిక్స్, పాలిటిక్స్‌లో కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది. రైల్వే ఎగ్జామ్ లో రీజనింగ్ లో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. కొంచెం ఎకాగ్రత సాధిస్తే 25 మార్కులకు పైగా తెచ్చుకోవచ్చు.

మ్యాథమెటిక్స్‌లో నెంబర్ సిస్టమ్, BODMAS, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోరేషన్, పర్సెంటేజెస్, మెన్స్యూరేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్వేర్ రూట్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ సిస్టెర్న్ టాపిక్స్‌పైన ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో అనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, సిల్లాజిసమ్, జంబ్లింగ్, వెన్ డయాగ్రాం, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ సఫీషియెన్సీ, కన్‌క్లూజన్స్, డిసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్‌మెంట్, ఆర్గుమెంట్స్ అండ్ అజంప్షన్స్ టాపిక్స్ ఉన్నాయి.