టాప్ స్టోరీస్ (Top Stories)

ప‌వ‌న్‌కు చిరంజీవి మాటిచ్చారు… నాదెండ్ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

జ‌న‌సేన పార్టీకి అండగా మెగాస్టార్ చిరంజీవి ఉంటార‌ని ఆ పార్టీ కీల‌క నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం విజ‌య‌వాడ‌లో పార్టీ క్రియాశీల‌క కార్య‌క‌ర్త‌ల స‌మావేశానికి నాదెండ్ల ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ప్ర‌మాద‌వ‌శాత్తూ మ‌ర‌ణించిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు ఆయ‌న ఆర్థిక సాయం అందించారు.

అనంత‌రం నాదెండ్ల మ‌నోహ‌ర్ మాట్లాడుతూ… ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను రెండేళ్ల పాటు సినిమాల్లో న‌టించేలా చిరంజీవి ఒప్పించార‌ని తెలిపారు. రెండేళ్ల త‌ర్వాత పూర్తిస్థాయిలో రాజ‌కీయ ప్ర‌స్థానం కొన‌సాగించాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు సూచించార‌ని, ప‌వ‌న్‌కు రాజ‌కీయంగా అండ‌గా ఉంటాన‌ని చిరంజీవి హామీ ఇచ్చార‌ని నాదెండ్ల మ‌నోహ‌ర్ పేర్కొన్నారు. నాదెండ్ల చేసిన ఈ ప్ర‌క‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయవ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన త‌ర్వాత చిరంజీవి రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. పూర్తిస్థాయిలో ఆయ‌న సినిమాల‌కే ప‌రిమితం అయ్యారు. పైగా ఒక హీరోగా, ఇండస్ట్రీ పెద్ద‌గా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తోనూ స‌న్నిహితంగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో నాదెండ్ల చేసిన ప్ర‌క‌ట‌న‌తో చిరంజీవి మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తారా అనే చ‌ర్చ మొద‌లైంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.