గుంటూరు జిల్లాలో రాజధాని ప్రాంతంలో వేకువజామున భూ కంపం సంభవించింది. తాడికొండ- తుళ్ళూరు మండల్లాల్లో భూకంపం రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. తెల్లవారుజామున 5 గంటల 6 నిమిషాలకు భూమి కంపించిందని స్థానికులు చెప్తున్నారు.. తుళ్లూరు, రాయపూడి, నెక్కల్లు, బడెపురం, కార్లపూడి గ్రామాల్లో భూకంపం సంభవించింది. దాని తీవ్రత వివరాలు అధికారాలు వర్గాల వెల్లడించిన తరువాత బహిర్గతమవుతాయి.