చెన్నంపల్లిలో శుక్రవారం కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. భార్యతో మొదలయిన తగువు మాట మాట పెరిగి మధ్యలో అత్త అడ్డు రావడంతో కొడవలితో నరికి హతమార్చారు. గ్రామానికి చెందిన హుసేన్‌బీ(55) అనే మహిళా కూలి పనులు చేస్తూ జీవించేది.ఆమెకు ముగ్గురు కుమార్తెలు ఉండగా వారు ముగ్గురికి పెళ్లిళ్లు చేసింది. రెండవ కుమార్తె షేకున్‌బీకు నార్పల ప్రాంతానికి చెందిన మహబూబ్‌బాషాతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. మహబూబ్‌బాషా మద్యానికి బానిస అయి తరచూ భార్యతో గొడవ పడుతూ ఉండేవారు.
వేధింపులు ఎక్కువ కావడం చేత రెండురోజుల క్రితం షేకున్‌బీని ఆమె తల్లి కూతుర్ని చెన్నంపల్లికి తీసుకువచ్చింది. రెండు రోజుల కింద మళ్ళీ ఆదిమ మోతాదులో మద్యం తాగిన మహబూబ్ తన భార్యను పంపాలని హుసేన్‌బీతో గొడవకు దిగడంతో మాటా మాటా పెరిగి ఆమెపై కొడవలితో దాడి చేసారు. హుసేన్‌బీ తలకు, చేతులకు గాయాలు అవగా తీవ్ర రక్తస్రావమైంది. అది చూసి మహబూబ్ మొదట పరారయ్యాడు. తరువాత పరారైన మహబూబ్‌బాషా నేరుగా నార్పల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తీవ్ర గాయాలైన హుసేన్‌బీను స్థానికులు 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఆమె మృతి చెందారు.నార్పల పోలీసులు నిందితున్ని బుక్కరాయసముద్రం పోలీసులకు అప్పగించారు.