చిత్తూరు జిల్లాకు చెందిన కుప్పంలో ఒక ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కిరణ్‌ (22) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విద్యార్ధి జిల్లాలోని శాంతిపురం మండలం రాళ్ల బూదుగూరుకు చెందినవారు.ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్య కారణం క్రికెట్ బెట్టింగ్ అని ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తనలాగా ఎవరూ బెట్టింగ్ చేయవద్దని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది.