వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిథిలోకి వచ్చే హస్తినాపురంలో ఈ రోజు తెల్లవారుజామున గౌతమ్ అనే యువకుడు మద్యం సేవించిన మత్తులో కారు నడిపి ట్రాఫిక్ స్తంభాన్ని ఢీకొట్టి, అనంతరం డివైడర్ మీద నుండి మరొక పక్కకి కార్ ను దూకించారు.కార్ లో సందీప్ అనే యువకుడు, మరొక యువకుడు ఉండగా సందీప్ అక్కడికక్కడే మృతి చెందగా మరొక యువకుడు పరారీలో ఉన్నారు.కార్ నడిపిన గౌతముని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కార్ సాగర రోడ్ నుండి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.