సుమారు 90 లక్షల మందికి మార్చ్ 1 నుండి కోవిద్ టీకా ఇవ్వనున్నట్టు, 60 ఏళ్ళు దాటిన వారిలో ప్రతి ఒక్కరికి టీకా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని గుర్తింపు పొందిన వైద్యులు ఇచ్చే సర్టిఫికెట్ 45 ఏళ్ళు దాటినా వారికీ కూడా టీకా ఇస్తారు. ఈ దీర్ఘకాళికా వ్యాధుల జాబితాలో 20 రకాలుగా వర్గీకరించారు.
రాష్ట్రంలోని 1,658 ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా, 564 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో రుసుము చెల్లించి టీకా పొందేలా ప్రభుత్వంవారు పంపిణీ చేయనున్నారు. కవీం యాప్ లో ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారికే కాకుండా పంపిణి కేంద్రాలకు వెళ్లిన వారికి కూడా వీలైతే అక్కడ పరిస్థితిని బట్టి టీకా వేస్తారు. అందరికి టీకా వేయడానికి వీలుగా ‘కొవిన్‌ 1.0’ యాప్‌ను ‘కొవిన్‌ 2.0’గా అవసరమైన మార్పులతో ఆధునికీకరిస్తున్నారు.అందుకే శని,ఆదివారాల్లో టీకా పంపిణి నిలిపివేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే 4 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీరు అందరు ఆరోగ్య సిబ్బంది,వీరిలో 67% మంది మొదటి డోసు టీకాను పొందగా, ఇతర శాఖల ఉద్యోగులు 6 లక్షల మంది ఉండగా వీరిలో ౩౫% మంది వరకు మొదటి టీకాను పొందారు.ఆరోగ్య సిబ్బందిలో 1 .40 లక్షల మంది రెండవ డోస్ టీకా ను కూడా పొందారు. సోమవారం నుండి కవీం అప్ లో టీకా అవసరమైతే వారి వివరాలు నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించాలనుకుంటున్నారు.