అంతర్జాతీయం (International)

అమెరికా అప్పులు – భారత్ కు కూడా చెల్లించాలి

అమెరికాలో కీలక చట్టసభ సభ్యుడు అలెక్స్‌ మూనీ అమెరికా అప్పులు అంతకంతకు పెరిగిపోతున్నాయంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పైగా ఎక్కువ శాతం అప్పులు ఆ దేశానికి అన్ని రంగాల్లోనూ పోటీ పడుతూ సవాల్ విసురుతున్న చైనా నుండి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. భారత్ కు కూడా 216 బిలియన్‌ డాలర్లు రుణగ్రస్తులైనట్టు వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా అప్పులు 29 ట్రిలియన్‌ డాలర్లకు చేరిందని చెప్పారు. 2020 కి అమెరికా జాతీయ అప్పులు మొత్తం 3.4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నాయి అని మూన్ తెలిపారు.అంటే ఆ దేశ ప్రజలు ఒక్కొక్కరి మీద సగటున 72,309 డాలర్ల అప్పు ఉంది అని చెపాప్రు. గత ఏడాది కాలంలో తీసుకున్న అప్పు ఒక్కొక్కరి మీద 10 , 000 డాలర్లు వస్తుందని, పైగా ఇలా ఉన్న రుణాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో సమాచారం సరిగా లేదని ఆరోపించారు. చైనా, జపాన్ కె ఎక్కువగా అమెరికా రుణపడి ఉందని, ఒక్కోదానికి ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా రుణపడ్డారని తెలిపారు. ఇంత ఋణం ఉండగానే రెండు ట్రిలియన్‌ డాలర్ల విలువ చేసే కరోనా ఉద్దీపన పథకాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి చట్టసభలో మూనీ ఈ వ్యాఖ్యలు వెల్లడించారు.

2000 సంవత్సరంలో 5.6 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్న అమెరికా అప్పులు ఒబామా నాయకత్వంలో ఉన్నప్పుడు రెండింతలైనట్లు మూనీ తెలిపారు . అప్పులను రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నామని, దీనితో అప్పుల నిష్పత్తి నియంత్రణలో లేకుండా పోతోందని వివరించారు. ఏదయినా పథకాలు పెట్టేముందు ఈ అప్పులను దృష్టిలో ఉంచుకుని ఆమోదించాలని తోటి చట్టసభ సభ్యులను కోరారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.