ఎస్ బి ఐ ఖాతాదారులకు ఒక హెచ్చరిక చేసింది.ఈ మధ్య డిజిటల్ పేమెంట్లు పెరగడంతో మోసాలు కూడా పెరిగిపోయాయి. ఒక్కోసారి ఎలాంటి యూపీ ఐ లావాదేవీ చేయకపోయినా కూడా అకౌంట్ నుండి డబ్బు మాయం అవుతుంది.అందుకే ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్ బి ఐ అలెర్ట్ అయి తమ కస్టమర్ లను అప్రమత్తం చేసింది.
ఒకవేళ ఎలాంటి ఆన్లైన్ లావాదేవీ జరపకుండానే బ్యాంకు ఖాతా నుండి మనీ కట్ అయితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలనీ ఖాతా సేవలను నిలిపివేస్తామని సూచించింది.
అలాంటి సమయంలో తక్షణమే స్పందించడానికి ఎస్ బి ఐ కొన్ని టోల్ ఫ్రీ నెంబర్ లు ఇచ్చింది.

అవి
టోల్ ఫ్రీ నెంబర్ 1800111109
ఐవీఆర్ నెంబర్లు 1800-425-3800..1800-11-2211 కు ఫోన్ చేయొచ్చు. లేదా
9223008333 నెంబర్ కు ఎంఎంఎస్ చేయాలంది.
మెయిల్ ద్వారా https://cms.onlinesbi.com/CMS/లోనూ ఫిర్యాదు చేయవచ్చంది.

ట్వీట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా ఎస్బిఐ 44 కోట్ల మంది తమ ఖాతాదారులను హెచ్చరించింది. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండమని కోరింది.