రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (ఆర్‌ఈ) తన బుల్లెట్‌ 350 బీఎస్‌6 మోడల్స్‌ ధరను మరోసారి పెంచింది. 2021లో ఇలా ధరల్ని సవరించడం ఇది రెండవసారి. ఇప్పుడు పెంచిన ధరతో ఈ బైక్ రూ.9 వేలు వరకు పెరిగింది. దీంతో గత ఏడాది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ 350 విడుదలైనప్పుడు రూ.1.21లక్షలుగా ఉన్న ధర ఇప్పుడు రూ.1.30 లక్షలకు చేరింది.ఈ వేరియంట్ను బట్టి రూ.3,100 నుంచి రూ.3,500 వరకు పెంచారు. ఈ బండి అన్ని వారియంట్స్ ధరలు ఎలా ఉన్నాయంటే..

బుల్లెట్‌ 350 స్టాండర్డ్‌ : రూ.1,30,228

బుల్లెట్ 350 (బ్లాక్ అండ్ ఫారెస్ట్‌ గ్రీన్‌‌): రూ.1,36,502

బుల్లెట్‌ 350 ఈఎస్‌ (ఎలక్ట్రిక్‌ స్టార్ట్‌): రూ. 1,46,152