కోవిద్ వాక్సిన్ ఎవరికి ముందుగా అందించాలనే దానిపై ఇంకా తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి.ప్రస్తుతం ప్రభుత్వం జన్యు సంబంధిత సమస్య అయిన డౌన్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తులకు ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ అందించాలని ఆలోచిస్తుంది.వీరు హై-రిస్క్ జాబితాలోకి వస్తారని గత అధ్యయనాల్లో నిరూపించబడింది దీంతో అప్రమత్తమైన యూకే, యూఎస్, స్పెయిన్ వంటి దేశాలు వారికే ముందుగా టీకాను అందించాయని తెలిసిన తర్వాత భారత్ కూడా అదే అనుసరించాలనుకుంటున్నట్టు విశ్వాసనీయ వర్గాల వారి సమాచారం.
సాధారణ వ్యక్తులతో పోలిస్తే డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు సాధారణ వ్యక్తుల కంటే మూడు రేట్లు ఎక్కువగా కరోనా ప్రభావానికి గురయ్యే అవకాశాలు ఉన్నట్టు అందులో వెల్లడించారు. భారత్లో ప్రతి సంవత్సరం సుమారు 30 వేల డౌన్ సిండ్రోమ్ కేసులు నమోదవుతాయి.
అసలు డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటంటే… శారీరక, మానసిక ఎదుగుదలను ఆపేసే జన్యుపరమైన సమస్య. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగే వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో వీరికి ప్రాధాన్యం ఇచ్చేలాగా చూస్తాము. డౌన్ సిండ్రోమ్ ఉన్నవారిని హై-రిస్క్ జాబితాలో చేర్చాలని మా తరువాతి సమావేశంలో ప్రతిపాదిస్తాం’’ అని జాతీయ టీకా నిపుణుల బృందం సభ్యుడైన డాక్టర్ సమీరన్ పండా తెలిపారు.