ఈ యాప్‌లో వారి సొంత (వివరాల నమోదు ప్రకారం) రాష్ట్రానికి చెందిన 2,222 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల వివరాలు పొందు పరచబడి ఉంటాయి.ఆరోగ్యసేతు యాప్ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. యాప్‌లో ఉండే ఆసుపత్రులు, సమయాన్ని అనుసరించి టీకా పొందేందుకు మీ వివరాలు నమోదుచేసుకోవచ్చు. పేరు, వయసు, పురుషులు/మహిళలు, పంపిణీ కేంద్రం, సమయాన్ని ఎంచుకోవాలి. ఈ వివరాల నమోదు జరిగిన వెంటనే సమయాన్ని (స్లాట్‌) కేటాయిస్తూ ఫోన్‌కు సంక్షిప్తసమాచారం ( ఎస్ ఎం ఎస్) వస్తుంది. ఆ సమయానికి మీరు వెళ్లి టీకా వేయించుకోవచ్చు.

నమోదు చేయాలంటే ఉండవలసిన అర్హతలు :
జనవరి 1, 2022ను పరిగణనలోకి తీసుకుంటూ 45 ఏళ్లు పైబడి మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు టీకా పంపిణీ కేంద్రానికి వెళ్లి అక్కడి సిబ్బందికి వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం చూపించాలి.60 ఏళ్లు దాటిన వారికి వైద్యుల సర్టిఫికేట్‌ అవసరం లేదు. మీ వయసు గుర్తించేందుకు జనవరి 1, 2022ను ప్రామాణికంగా తీసుకుంటారు.
దానికి కావలసిన పత్రాలు ఏంటంటే.. ఆధార్‌ కార్డు, ఫొటోతో కూడిన ఓటరు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌పోర్టు, ఫొటోతో ఉన్న పింఛను డాక్యుమెంట్, ఎన్‌పీఆర్‌ కార్డు.గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలి.