ప్రైవేట్ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టీకాను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో టీకా పొందేవారికి ఉచితంగా ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వమే ప్రైవేట్ ఆస్పత్రిలో టీకా వేయించుకోవాలంటే మాత్రం డబ్బు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రైవేట్ ఆస్పత్రిలో కోవిద్ టీకా డోసుకు రూ. 250 చొప్పున ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అతి త్వరలో దీనిపై కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

ప్రైవేట్ ఆస్పత్రిలో ఇచ్చే టీకా ధర సర్వీస్ చార్జీలతో కలిపి ఒక్కో డోస్ రూ. 250 చొప్పున రెండు డోస్ లకు కలిపి రూ. 500 ఉంటుందని విశ్వాసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ధర ఉండనుంది అని, భవిష్యత్తులో ఇది పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఆస్పత్రులు మరియు టీకా వాక్సిన్ తయారీదారులు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని ఇటీవల కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ చెప్పారు.